ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాదు వచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ర్యాలీగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు.
చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న అభిమానులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాదు వచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి ర్యాలీగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. జోరు వాన కురుస్తున్న లెక్కచేయకుండా వందలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. నగర పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన వాహనాలతో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందుకు సాగింది. చంద్రబాబు నాయుడుకు ఎక్కడకక్కడ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. భారీ గజమానులు, పుష్పగుచ్చాలని వేస్తూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో నగర పరిధిలోని అనేక జంక్షన్ వద్ద స్వాగత కారణాలతో పాటు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐదు గంటలకు పైగా చంద్రబాబు నాయుడు ర్యాలీ సాగినట్లు తెలుస్తోంది.
రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం
విభజన సమస్యలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో మీరు ఇరువురు భేటీ కానున్నట్లు చెబుతున్నారు. విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చించాలంటూ కొద్దిరోజుల కిందట నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు లేఖ రాయగా, అందుకు సమయాన్ని ఫిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురి నేతలు శనివారం భేటీ కానున్నారు. ఇందుకోసం తెలంగాణలోని ప్రజాభవన్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.