తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రేవంత్ రెడ్డి||

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు కాసేపటి క్రితమే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. రేవంత్ వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని వెల్లడించారు. ఆయనను పార్టీ శాసన సభ్యులంతా కలిసి సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు.

కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 2023 డిసెంబర్ 4నే ఉంటుందని రాజ్ భవన్ కు కాంగ్రెస్ పార్టీ సమాచారం ఇవ్వడంతో రాజ్ భవన్‌కు కుర్చీలు, టేబుళ్లు, ఇతర ఫర్నిచర్ సామగ్రి తరలించారు. ఈ క్రమంలోనే రాజ్ భవన్‌లో ఏర్పాట్లు జరిగాయి. 4వ తేదీనే ప్రమాణం ఉంటుందని అనుకున్నా, హైకమాండ్ నిర్ణయం వెలువరించకపోవడంతో ఆలస్యమైంది. అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సమావేశం అయ్యి సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానికి అప్పగించారు. దీంతో అనేక తర్జన భర్జనల మధ్య అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ఇక వీరంతా ఇప్పుడు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ ప్రమాణ స్వీకార ఉత్సవం జరగనుంది. మొత్తం వ్యవహారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే బీఆర్ఎస్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్, కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ విడుదల చేశారు కూడా.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్