టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై కేటీఆర్ ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ప్రెస్‌మీట్ లో కేటీఆర్||


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ పై ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో  ముఖ్యమంత్రి కేసీఆర్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ బేటిలో ప్రశ్న పత్రం లీకేజ్ గురించి చాలా సమయం చర్చించి సమావేశంలోని వివరాలను మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లతో పాటు ఇంకెవరు ఉన్న.. వారందరిని కఠినంగా శిక్షిస్తామని, పేపర్ లీకేజ్ లో ఐటీ మంత్రి ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ వెల్లడించారు.

అలాగే ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా తాము చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి తెలిపారు. యువతకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై కనీస అవగాహన లేకుండా ఐటీ మంత్రి నిర్వహించవలసిన పనులు ఏంటో తెలియకుండా మాట్లాడితే చాలు.. ఐటీ మంత్రిని తొలగించాలి అని ఆరోపిస్తున్నారు.. ఐటీ మంత్రి ఏం చేస్తాడో తెలుసా.. ఐటీ డిపార్ట్మెంట్ విధులు ఏంటో తెలుసా.. అంటూ ప్రతిపక్ష నేతలకు ప్రశ్నలు విసిరారు. రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షకు ప్రతి కంప్యూటర్ కి ఐటీ మంత్రి బాధ్యుడునని ఎలా  ఆరోపిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కి ఐటీ డిపార్ట్మెంట్ పై అవగాహన ఉందా.. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు.  పరీక్షలు లీకేజీ కేసులో రాజశేఖర్ రెడ్డి బీజేపీ వ్యక్తేనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆలోచనలతోనే ఇలా చేశారని, రాజశేఖర్ రెడ్డి పై ఇంకా దర్యాప్తు చేయాలని డీజీపీని కేటీఆర్ కోరారు. బండి సంజయ్ నోటిఫికేషన్లు యువతను ఆకర్షించుకునేందుకేనా.. అని చేసిన కామెంట్స్ వల్లనే అనుమానించాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అలాగే 37 వేల ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ జరిగింది. 10 లక్షల మందికిపైగా పరీక్ష నిర్వహించే ఘనత టీఎస్‌పీఎస్సీ ఉందని భారత దేశంలో అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టీఎస్‌పీఎస్సీ ఒకటి. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రద్దు చేసిన పరీక్షలకు మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దు చేసిన పరీక్షలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తాము. రీడింగ్ రూమ్స్ 24 గంటలు తెరిచే ఉంటాయని, అలాగే భోజన వసతి కూడా కల్పిస్తామని, 4 పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్స్ ఆన్ లైన్ లో పెడతామని ఐటీ మంత్రి వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్