తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ రద్దు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| తెలంగాణలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు ||

ఈవార్తలు, తెలంగాణ బడ్జెట్ :  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగులు ఉండనే ఉండరని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ శాశ్వత ఉద్యోగులుగా మార్చుతున్నట్లు తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల చేస్తామని, ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులంతా రెగ్యులర్ అవుతారని వెల్లడించారు. అటు.. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

వ్యవసాయ రంగానికి - రూ.26,831 కోట్లు, నీటిపారుద‌ల శాఖ‌కు రూ.26,885 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ.12,727 కోట్లు, ఆస‌రా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు, ద‌ళిత‌బంధు కోసం రూ.17,700 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు, మ‌హిళా, శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు, గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు, విద్య రంగానికి రూ.19,093 కోట్లు, వైద్య రంగానికి రూ.12,161 కోట్లు, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు, అట‌వీ శాఖకు రూ.1,471 కోట్లు, పంచాయ‌తీ రాజ్‌కు రూ.31,426 కోట్లు, హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ.1471 కోట్లు, రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ.6,385 కోట్లు, పుర‌పాల‌క శాఖ‌కు రూ.11,372 కోట్లు, రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ.2,500 కోట్లు, కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ.200 కోట్లు, ప‌ల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ.12,000 కోట్లు, ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ.1,463 కోట్లు, ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు, ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ.366 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.3,001 కోట్లు, న్యాయశాఖకు రూ.1,665 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1,000 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్  కేటాయించింది.

ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, దళితబంధుకు రూ.17,700 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు, పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31,426 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు, యూనివర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు రూ.10,348 కోట్లు, మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ.750 కోట్లు, సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు, యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ.200 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,022 కోట్లు, ఆర్టీసీ అభివృద్ధికి రూ.1,500 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.200 కోట్లు, మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్