తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ సీఎం కేసీఆర్, సోమేశ్ కుమార్||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. ఆయనను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు జీవో.676 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్ శర్మను కూడా సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ నుంచి ఏపీకి..

బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఏపీ విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించినా, క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగారు. సీఎస్‌గా పనిచేశారు. క్యాట్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో డీవోపీటీ సవాల్ చేయగా.. హైకోర్టు ఆయనను తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. దీంతో ఏపీకి వెళ్లిపోయారు. అక్కడ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవటంతో ఏపీ సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అనంతరం ఏపీ నుంచి తెలంగాణకు ఇప్పుడు సీఎం ముఖ్య సలహాదారుగా వచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్