కాళేశ్వరం కరప్షన్ రావు కేసీఆర్.. ఏటీఎం ఏర్పాటుతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||కాళేశ్వరం కరప్షన్ రావు కేసీఆర్.. ఏటీఎం ఏర్పాటుతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం||

కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ప్రజలను చేరుకోవడానికి 6 గ్యారంటీ వంటి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వ అవినీతిని ప్రచారం చేయడానికి వినూత్న పంథాతో ముందుకు వెళ్తోంది. మేడిగడ్డ కుంగుబాటును అస్త్రంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లడానికి వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. హైదరాబాద్ నగరం అంతటా కాంగ్రెస్ మంగళ, బుధవారాలలో కాళేశ్వరం ఏటీఎంలను ఏర్పాటు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంలను పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫోటోతో రూపొందించిన ఏటీఎంపై కాళేశ్వరం కరపక్షన్ రావు అని ట్యాగ్ లైన్ కూడా ముద్రించారు. ముఖ్యమంత్రికి తోడుగా కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు ఫోటోలు కూడా ఏటీఎంపై ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం ఎలా జరిగిందో వివరించే ఇతివృత్తంతో ఏటీఎం నుంచి లక్ష కోట్ల రూపాయల నోటు బయటకు వస్తున్నట్లు ఉంటుంది. కాళేశ్వరం నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా లక్ష కోట్లు దుర్వినియోగం చేసిందో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఏటీఎంను రూపొందించామని నాయకులు చెప్తున్నారు. అయితే, ప్రజలు ఈ ఏటీఎంలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన పిల్లర్ల గురించి చర్చించుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్