ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికారం అన్నది ప్రజలు పగ తీర్చుకోవడానికి ఇవ్వరని, కోపం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోకూడదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించి పాలనను విస్మరించినందు వల్లే ప్రజలు జగన్ కు గుణపాఠం చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికారం అన్నది ప్రజలు పగ తీర్చుకోవడానికి ఇవ్వరని, కోపం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోకూడదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించి పాలనను విస్మరించినందు వల్లే ప్రజలు జగన్ కు గుణపాఠం చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిడిపిని ఖతం చేయాలని పగబట్టి, చివరికి ఏమి చేయకుండా తన పార్టీనే ఖతం చేసుకున్నాడని విమర్శించారు. మనం చేసిన పాపాలు మనల్ని ఏదో ఒకనాడు మింగుతాయని చెప్పడానికి జగన్ తుడుచుకుపెట్టుకుపోయిన ఉదంతమే ఉదాహరణగా పేర్కొన్నారు. అంతకుమించిన శిక్ష ఆయనకు మరేమీ లేదన్నారు.
జగన్ ను నమ్మి ప్రజలు 151పైగా సీట్లు ఇచ్చినప్పుడు నమ్మకంతో ఇచ్చారని, కానీ ఆ నమ్మకాన్ని ఆయన గద్దెనెక్కిన తర్వాత నిలబెట్టుకోలేకపోయారన్నారు. జగన్ వ్యవహార శైలే ఆయన దెబ్బతీసిందన్నారు. తన వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీలను తిట్టి పంపించారని, వారు ఇతర పార్టీల్లో చేరి గెలిచి వచ్చారని గుర్తు చేశారు. జగన్ చేసిన అక్రమాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయని, ఆ రాష్ట్రం దెబ్బతిన్నదని వెల్లడించారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాదులో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించామన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబుది తనకు ఫోన్ చేసే స్థాయి కాదని, ఆయన తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి చిల్లర పనులు చేయలేదన్నారు. అలా దిగజారడం ఆయన వ్యక్తిత్వం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాలు, తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక మంత్రి పట్టుబట్టి, అధికారులను చివాట్లు పెట్టి జగన్ ఇంటి వద్ద కట్టడాలను కూల్చి వేయించారని పేర్కొన్నారు. ఆ మంత్రికి వైవి సుబ్బారెడ్డి 50 సార్లు ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేశారని, ఖమ్మానికి చెందిన ఇంకో మంత్రి ద్వారా రాయబారం కూడా నడిపించారన్నారు. జగన్ ఇంటి వద్ద కూల్చివేతల విషయం తనకు తెలిసిన వెంటనే సదరు అధికారిని జిఏడీకి అటాచ్ చేసినట్లు వెల్లడించారు.
పక్క రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో రాజకీయ కేసులో నమోదు కాలేదని, ఇకపై ఉండవని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలన్నింటిపై త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు, అనుమతులు తెచ్చుకుంటామన్నారు. ఏపీతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. ఆంధ్ర సర్కార్ తో చర్చలకు తమకు ఎటువంటి భేషజాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో వీలైనంతవరకూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యలు పరిష్కారానికి కోర్టులు ఉన్నాయని, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వివిధ నివేదికలను ఉపయోగించుకుంటామని వెల్లడించారు.