తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.
కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ ఘనస్వాగతం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జిష్ణుదేవ్‌కు సీఎం సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం కొత్త గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
కాగా, ఈ రోజే ఆయన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రి అయిన జిష్ణు దేవ్.. త్రిపుర నుంచి ఓ రాష్ట్రానికి నియమితులైన తొలి గవర్నర్ ఈయనే. గతంలో రాజకీయ పదవుల్లో ఉన్న తాను.. రాజ్యాంగబద్ధ పదవి చేపట్టబోతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తానని వెల్లడించారు.