తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చరుకున్నారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. రెండు రోజులపాటు రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆయన సమావేశమయ్యారు.
మల్లిఖార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చరుకున్నారు. సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. రెండు రోజులపాటు రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, హామీలు అమలుకు సంబంధించి కీలక అంశాలను వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దీని గురించి ఆయన వివరించారు.
జూలై 18 లోపు లక్ష లోపు రుణాలు ఉన్న అన్న దాతలు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాన్ని వివరించారు. అలాగే, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన విషయాలను ముఖ్య నాయకులతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. రుణమాఫీ అమలుకు సంబంధించిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చినట్టు చెబుతున్నారు. అదే విధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనాయకులతో రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉందని చెబతున్నారు. పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్య అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.