డిసెంబర్ 4న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ రోజు ఎందుకు నిర్వహిస్తారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సీఎం కేసీఆర్||

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అనగా, డిసెంబర్ 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కేసీఆర్‌కు ఆ అధికారం ఉంటుందా?

డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు విడుదల అవుతాయి. ఒకవేళ బీఆర్ఎస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోతే ఎలా? ఒకవేళ వచ్చినా కొత్త ప్రభుత్వం కదా! కేబినెట్ సమావేశం నిర్వహించాల్సింది? అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతాయి. అయితే, అసెంబ్లీ ఫలితాలను బట్టి కేబినెట్ సమావేశం నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనదే. ప్రస్తుత ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

కేబినెట్ భేటీలో ఏం చేస్తారు?

కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే కేబినెట్ సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేస్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ఒక్కరు రాజీనామా చేసినా కేబినెట్ మొత్తం రద్దు అవుతుంది. కానీ, కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి కేబినెట్ సమావేశం నిర్వహించి, తీర్మానం చేయనున్నారు. ఆ తీర్మానం కాపీని గవర్నర్‌కు పంపుతారు. ఆ తర్వాత గవర్నర్ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని ఆహ్వానిస్తారు. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీకి, కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానం పంపుతారు. హంగ్ వస్తే ఏ పార్టీకి ఎక్కువ లీడ్ ఉంటే, ఆ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్