ఉగాదికి ముహూర్తం.. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చ జెండా ఊపింది. ఉగాది సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది.

telangana cabinet expansion

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చ జెండా ఊపింది. ఉగాది సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 4 మంత్రి పదవులక భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకూ కాంగ్రెస్ అధిష్ఠానం ఓకే చెప్పింది. ఈ మేరకు కాసేపటి క్రితమే పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ పథకాల పనితీరును వారికి రేవంత్ వివరించారు. ఈ భేటీలో రాష్ట్రం నుంచి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్