||పోచంపల్లి గిరిధర్‌కు సంఘీభావం||
(ఎల్బీనగర్, ఈవార్తలు ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)
ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎక్కడ బ్రాహ్మణ అభ్యర్థులు పోటీ చేసిన వారు వారి సత్తా చాటాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి అన్నారు. సోమవారం నాడు ఎల్బీనగర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పోచంపల్లి గిరిధర్ ను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు బ్రాహ్మణులు ఎక్కడ నుంచి పోటీ చేసిన పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు అందజేస్తామని తెలిపారు ఏ రాజకీయ పార్టీలు బ్రాహ్మణులను పావులుగా ఉపయోగించుకొని వారికి సముఖిత స్థానం ఇవ్వటం లేదని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు మంత్రి సునీల్ గంప రామారావు తడకమళ్ళ రవికుమార్ కాలువ బాల్రాజ్ ఉప్పల శ్రీనాథ్ పోచంపల్లి శ్రీధర్ రావు తదితరులు గిరిధర్ రావును కలిసిన వారిలో ఉన్నారు బ్రాహ్మణులందరూ ఐకమత్యంగా ఉండి గిరిధర్ రావుని గెలిపించాలని కోరారు.