రేవంత్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు.. వారి రాజకీయ సమాధికి నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా సొంత ప్రభుత్వంపైనే గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. ఓ సందర్భంలో తాను ప్రతిపాదించిన బీసీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి కాదన్నారని కూడా అసహనం వ్యక్తం చేశాడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.

revanth teenmar mallanna

సీఎం రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న

మిర్యాలగూడ, ఈవార్తలు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా సొంత ప్రభుత్వంపైనే గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. ఓ సందర్భంలో తాను ప్రతిపాదించిన బీసీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి కాదన్నారని కూడా అసహనం వ్యక్తం చేశాడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ మధ్య కాలంలో నిత్యం బీసీ జపం చేస్తున్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ రాజకీయ చైతన్య వేదిక కోకన్వీనర్ అర్జున్, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సభ ఆరంభం మాత్రమేనని, అసలు ఉద్యమం ముందుందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలంతా చైతన్యవంతులయ్యారని వెల్లడించారు.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని అన్నారు. ఈడబ్ల్యూఎస్ పేరిట ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీలను రాజకీయంగా అణచివేసిన నల్లగొండ జిల్లాలోని నేతలను రాజకీయ సమాధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీసీ బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. తాము ఎన్నికల్లో ఓసీల ఓట్లు అడగబోమని, బీసీల ఓట్లు అడగబోమన్న ధైర్యం ఓసీలకు ఉందా? అని ప్రశ్నించారు. రాబోయే టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికే ఓటు వేయాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఈ సభలో మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్