తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలుకురించి మాట్లాడారు. ఎంపీలు పేర్లు, వివరాలు తెలుసుకున్న ప్రధాని.. ఈ సందర్భంగా వారితో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
ప్రధాని మోదీని కలిసిన టిడిపి ఎంపీలు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలుకురించి మాట్లాడారు. ఎంపీలు పేర్లు, వివరాలు తెలుసుకున్న ప్రధాని.. ఈ సందర్భంగా వారితో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పని చేస్తామని మోదీ స్పష్టం చేశారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రధాని ఎంపీలకు భరోసా ఇచ్చినట్టు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు తదితర ఎంపీలు ఉన్నారు. ప్రధానికి పుష్ఫగుచ్ఛం అందించి, శాలువతో ఈ సందర్భంగా ఎంపీలు సత్కరించారు. ప్రధాని ఆప్యాయంగా పలుకరించారని, రాష్ట్రాభివృద్ధికి ఆయన అంకితభావంతో ఉన్నారని పలువురు ఎంపీలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రధాని సంసిద్ధంగా ఉన్నట్టు ఎంపీలు వెల్లడించారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరగ్గా, ఓం బిర్లా రెండోసారి ఎంపిక అయిన విషయం తెలిసిందే.