తెలంగాణపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి.. పార్టీ బలోపేతంపై నేతలకు హామీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని పార్టీని పూర్తిగా ఆయన విస్మరించారు. గడిచిన ఎన్నికల్లో పార్టీ పోటీ కూడా చేయలేదు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. శనివారం రాత్రి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

Nara Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని పార్టీని పూర్తిగా ఆయన విస్మరించారు. గడిచిన ఎన్నికల్లో పార్టీ పోటీ కూడా చేయలేదు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. శనివారం రాత్రి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న క్యాడర్ వంటి అంశాలను తెలుసుకున్నారు. కొద్దిరోజుల్లోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. అదే సమయంలో మరో రెండు మూడు వారాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుని నియమించనున్నట్లు నాయకులకు హామీ ఇచ్చారు. ఇతర కమిటీలను నియమించి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. తెలంగాణలో ఒకప్పుడు బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీ క్రమేణ బలహీనమైందని, మళ్లీ బలమైన పార్టీగా పునర్ నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. వారంలో రెండు రోజులు తెలంగాణలోని పార్టీ కోసం కేటాయించినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ ముఖ్య నాయకులు ఇకపై ఆక్టివ్ గా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని సాగించడం ద్వారా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలోని పార్టీపై దృష్టి సారించడం పట్ల కేడర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. 

ఎన్టీఆర్ భవన్లో సమావేశం 

తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో సమావేశం అయ్యారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు నాయకులకు వెల్లడించారు.  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఈ మేరకు చర్చలు జరుపుకునే విషయాన్ని నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. గత ఎన్నికల్లో అని వారి కారణాలవల్లే పోటీ చేయలేకపోయామని, పార్టీ అధ్యక్షుడిని నియమించుకోలేకపోయినట్లు అంగీకరించిన చంద్రబాబు నాయుడు. కొద్దిరోజుల్లోనే అధ్యక్షుడు నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్