టీడీపీలో కొత్త వ్యవస్థ.. ప్రకటించిన చంద్రబాబు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు||

టీడీపీలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జక్కంపేటలో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు రోడ్ షో చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథి నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సాధికార సారధి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేట్లు చూస్తామని చంద్రబాబు తెలిపారు. సాధికార సారధిలో మహిళలకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా తాము ప్రయత్నిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత పనుల వల్ల రాష్ట్రంలో అథోగతి గురికావాల్సి వచ్చిందని చంద్రబాబు వాక్యానించారు. సీఎం జగన్ కొత్తగా "నువ్వే మా నమ్మకం" అనే స్టిక్కర్లను ఇంటింటా అంటిస్తున్నారు. కానీ జగనే రాష్ట్రానికి దరిద్రం అని ప్రజలు నమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలపై 45 రకాల పన్నులు వేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనుకకు పంపిస్తున్నాడు అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. మన రాష్ట్రానికి కొత్త పరిశ్రమ ఏర్పరచుకొనెందుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గుణపాఠం చెప్పాలని కోరారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్