టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వీరిద్దరు వేర్వేరుగా హస్తినకు వెళ్లారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వీరు పాల్గొననున్నారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వీరిద్దరు వేర్వేరుగా హస్తినకు వెళ్లారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై జరగనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వీరు పాల్గొననున్నారు. మరోవైపు, తన ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని సహా ఎన్డీయే అగ్రనేతలను చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఘన విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఎన్నికలు ఇవి అని వెల్లడించారు. తాము ఎన్డీయేలోనే ఉంటామని, అందుకోసమే ఈరోజు ఢిల్లీ వెళ్తున్నానని వివరించారు. ఇందులో వేరే ఆలోచలనకు తావు లేదని స్పష్టం చేశారు.
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు, జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ ఆఫీస్‌లో పవన్ సమావేశమై, అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పనిచేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని హితవు చెప్పారు.