మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించండి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, తాట తీయాలని స్పష్టం చేశారు. జనవాణి - జనసేన - భరోసా పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు అండగా ఉంటామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

deputy cm pawan kalyan

ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ 

ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కల్యాణ్‌ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, తాట తీయాలని స్పష్టం చేశారు. జనవాణి - జనసేన - భరోసా పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు అండగా ఉంటామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఫిర్యాదులు అందించేందుకు వచ్చిన వారితో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. మహిళలను వేధించినా, ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు నుంచి నేరుగా ఆయన వినతులను స్వీకరించారు. పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమానికి అనేక ప్రాంతాలు నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. వెంకటగిరిలో మహిళలు, వృద్ధులను వేధిస్తున్నారంటూ ఒక మహిళ పంపిన అర్జీపై పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించారు.

ముఠాలుగా ఏర్పడి కొందరు యువకులు బైకులపై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులు, యువతులను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని పవన్‌ కల్యాణ్‌కు పంపించిన లేఖలో పేర్కొన్నారు. యువతుల ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్ధాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ పవన్‌ కల్యాణ్‌కు తెలిపారు. అనంతరం వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌.. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా చదివి అధికారులకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్