||రేవంత్ రెడ్డి||
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎల్పీ నేతను ఎన్నుకొనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. తాజాగా రెండు రోజులుగా ఎల్లా హోటల్‌లోనే ఉన్న రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రేవంత్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అటు కేసీ వేణుగోపాల్‌తో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. ఇంతకుముందు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో ఎవరు సీఎంగా ఉంటారన్నది తెలియాల్సి ఉంది.