తెలంగాణ బీజేపీ చీఫ్‌ పేరు ఖరారు.. ఏ క్షణమైనా ప్రకటించే చాన్స్

గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న బీజేపీ కొత్త జోష్‌తో రంగంలోకి దిగబోతోందా? కొత్త సారథిని ఫైనల్ చేసేసిందా? అంటే తాజా పరిస్థితులు అవుననే అంటున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం..

bjp telangana president

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా

హైదరాబాద్, ఈవార్తలు: గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న బీజేపీ కొత్త జోష్‌తో రంగంలోకి దిగబోతోందా? కొత్త సారథిని ఫైనల్ చేసేసిందా? అంటే తాజా పరిస్థితులు అవుననే అంటున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. తుది నిర్ణయం కోసం ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి చివరికి ఈటల వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అందరితో సంప్రదింపులు జరిపారు. ఇదే సమయంలో.. ఏ ప్రత్యేక సందర్భం లేకుండానే ఈటల తన ఫ్యామిలీతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఈటలను ఫైనల్ చేసేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈటల ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆయనకే అధ్యక్ష పదవిని ఖరారు చేసిందనటానికి సంకేతాలు వచ్చినట్లుగా బీజేపీ వర్గాలు అంచనాకు వస్తున్నాయి. 

వ్యతిరేకత వ్యక్తమైనా..!

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు ఓకే అయినట్లు గాసిప్స్ వచ్చాయి. అయితే, ఆయన వ్యతిరేక వర్గం బలంగా ఉందని పార్టీలో చర్చ జరిగింది. ముఖ్యంగా ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న వారికే ప్రాధాన్యం కల్పించాలన్న ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. డీకే అరుణ కూడా మహిళా కోటాలో అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించారు. కానీ, చివరగా.. కేసీఆర్ మాదిరి మాస్ ఇమేజ్ ఉన్న ఈటలవైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపితున్నట్లు సమాచారం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్