నేడు దేశ వ్యాప్తంగా ఆరో దశ పోలింగ్.. 58 సీట్లకు జరగనున్న ఎన్నికలు

లోక్ సభ ఎన్నికల సమయంలో భాగంగా ఆరో దశ పోలింగ్ శనివారం జరుగుతోంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్ నడుస్తోంది.

polling date
ప్రతీకాత్మక చిత్రం

లోక్ సభ ఎన్నికల సమయంలో భాగంగా ఆరో దశ పోలింగ్ శనివారం జరుగుతోంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్ నడుస్తోంది. దేశ రాజధానిలోని ఏడు స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశ ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో పలు కీలక స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాలు, పశ్చిమబెంగాల్, బీహార్ లో 8 చొప్పున స్థానాలకు, ఒడిస్సాలో ఆరు, జార్ఖండ్ లో నాలుగు, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఆయా స్థానాల్లో 889 మంది అభ్యర్థుల పోటీ చేస్తుండగా.. 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనన్నారు. ఒడిశా లోని 42 అసెంబ్లీ సీట్లకు శనివారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇలా ఉంటే బెంగాల్లో పోలింగ్ జరగనున్న ఎనిమిది స్థానాలు గిరిజనులు పట్టు ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలోనివే. వీటిలో గత ఎన్నికల్లో బిజెపి 5, తృణమూల్ కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచాయి. ఈసారి ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమత ప్రతిష్టకు సవాల్ గా మారాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్