ప్రముఖ నటుడు నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత

ప్రముఖ నటుడు నాగార్జునకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణం అంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. శనివారం ఉదయం నుంచి ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని గతంలో నాగార్జునపై ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

Officials are demolishing N Convention

ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న అధికారులు

ప్రముఖ నటుడు నాగార్జునకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్రమ నిర్మాణం అంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. శనివారం ఉదయం నుంచి ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని గతంలో నాగార్జునపై ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ ను శనివారం ఉదయం నేలమట్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అక్కడ దాక వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనక్కి వచ్చేసాయి.

అప్పటి నుంచి ఈ భవనం జోలికి ఎవరు వెళ్లలేదు. అయితే, ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు. నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పది ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఫిర్యాదులు వచ్చిన స్థలానికి సంబంధించిన ప్రాంతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఫిర్యాదులు నేపథ్యంలో హైడ్రా అధికారులు తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్కడికి వెళ్లి సెంటర్ కూల్చివేత పనులను చేపట్టారు. ఇప్పటికీ ఆ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అయితే  కన్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణాన్ని కూల్చివేయడంపై నాగార్జున గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎవరు ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కూల్చివేత జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్ వైపున్స్కు ఎవరూ రాకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా రాజకీయాలకు అతీతంగా ఉండే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేయడం పట్ల సర్వత్ర చర్చ జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్