వైయస్ ఆత్మ క్షోభకు గురయ్యేలా వ్యవహరిస్తున్న షర్మిల : రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇష్టానుసారంగా మాట్లాడుతూ వైయస్ ఆత్మ క్షోభకు గురయ్యేలా షర్మిల వ్యవహరిస్తున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారని, అయితే ఆ కన్నీళ్లు ఎవరికోసం పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వైయస్ ఆత్మ క్షోభకు గురయ్యేలా వ్యవహరిస్తున్నామంటూ విమర్శించారు.

MP Vijayasai Reddy talking to the media

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇష్టానుసారంగా మాట్లాడుతూ వైయస్ ఆత్మ క్షోభకు గురయ్యేలా షర్మిల వ్యవహరిస్తున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారని, అయితే ఆ కన్నీళ్లు ఎవరికోసం పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వైయస్ ఆత్మ క్షోభకు గురయ్యేలా వ్యవహరిస్తున్నామంటూ విమర్శించారు. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని భావించడం తగదన్నారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ హామీను అమలు చేయడంలో విఫలమై ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను ఇలా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్మోహన్ రెడ్డికి షర్మిల రాసిన లేక టిడిపి నేతలు వద్దకు ఎలా చేరిందంటూ విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా టిడిపి నాయకులు, ఆ పార్టీకి చెందిన మీడియా చేస్తుంటే మీరు ప్రేక్షక పాత్ర పోషించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే మీ ఇద్దరి మధ్య ఎంఓయు కుదిరి విషయం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. తన ఆస్తిలో జగన్మోహన్ రెడ్డి 40 శాతం ఇచ్చేందుకు ముందుకు వచ్చి ఎంవోయు కుదుర్చుకున్న మాట నిజం కాదా.? అని ప్రశ్నించారు. చెల్లికి ఇవ్వాలి అనుకోబట్టే ఆయన అలా చేశారని, ఆ ఎంఓయులో కూడా నిబంధనలను స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన వ్యక్తితో కలవడం, కుట్రలు చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.  కోర్టు కేసులు పూర్తయిన తరువాతే ఆస్తుల పంపకాలు జరగాలన్న విషయం షర్మిలకు తెలియదా అని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, మీరు చేసిన కుట్ర కాదా అని ఈ సందర్భంగా విజయసాయి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానీయకుండా చేయడమే మీ ఇద్దరు లక్ష్యంగా ఉందని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి కు సంబంధించిన ఆస్తులను ఆయన బతికుండగానే కొడుకు, కూతురుకు పంపకాలు చేశారన్నారు. చంద్రబాబుతో కలిపిన చేతులు విడిచిపెట్టాలని, అతడు దుర్మార్గుడని విమర్శించారు. మానవజన్మ ఎత్తేందుకు కూడా అర్హుడు కానీ చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్