విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో జగన్ నిర్ణయాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహాలను పన్నుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, ఆర్థికంగాను భారీ మొత్తంలో ఖర్చు చేసి వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను లోబర్చుకునే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా బరిలోకి దించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగాను బలమైన నేత కావడంతో పాటు రాజకీయంగా చతురత కలిగిన బొత్స సత్యనారాయణ అయితేనే.. టిడిపి వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ పేరును జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, మూడు ముత్యాల నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కోలా గురువులుతోపాటు మరికొందరు నాయకులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఇచ్చిన అసమ్మతి పొగ కమ్మే అవకాశం ఉందని జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఈ తరహా ఇబ్బందులకు చెక్ చెప్పాలంటే బొత్స వంటి సీనియర్ నేత అయితేనే బాగుంటుందని ఆయన భావించారు. అందులో భాగంగానే బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో వైసీపీకి ఉన్న సంఖ్య బలాన్ని బట్టి చూస్తే సులభంగానే ఈ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 812 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 600 కి పైగా స్థానాల్లో వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థులే ఉన్నారు. దీంతో ఈ స్థానాన్ని గెలుచుకోవడం వైసీపీకి కష్టం కాకపోవచ్చు అని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ ఆర్థిక, అంగ, అధికార బలాన్ని వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చావంటి సీనియర్ నేతను జగన్మోహన్ రెడ్డి బరిలోకి దించుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అభ్యర్థిని ఖరారు చేయడంపై దృష్టి సారించింది.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్