ఏపీ శాసనసభ స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు టిడిపి వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు.

Ayyanna Patradu

అయ్యన్న  పాత్రుడు 


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు టిడిపి వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో తాజా ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు విజయం సాధించి అసెంబ్లీలోకి ఏడోసారి అడుగు పెట్టారు. 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి టిడిపిలోనే అయ్యన్నపాత్రుడు కొనసాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇటీవల మంత్రివర్గ ఏర్పాటులో ఆయనకు బెర్తు లభించలేదు. సామాజిక సమీకరణాల దృష్ట్యా అయ్యన్న కు చంద్రబాబు అవకాశం కల్పించలేకపోయారు.  గడిచిన ఐదేళ్లలో అధికార వైసిపిపైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. దీంతో ఆయనపై పలు అక్రమ కేసులను కూడా పెట్టారు. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ భూమికి ఫోర్జరీ ద్రువ పత్రాలతో ఎన్ఓసి తీసుకున్నారన్న ఆరోపణలతో సిఐడి పోలీసులు 2002 నవంబర్ రెండో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి గోడల దూకు మరి ఆయన్ని, ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. అయినప్పటికీ అయ్యన్నపాత్రుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటాన్ని కొనసాగించారు. తాజా ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీనియార్టీకి గౌరవాన్ని ఇచ్చి స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. స్పీకర్ పదవిని కోరుతూ ఒకరిద్దరూ సీనియర్లు ముఖ్యమంత్రిని కలిసినా.. అయ్యన్నను ఎంపిక చేసినట్లు ఆయన వారికి తెలియజేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఉత్తరాంధ్రకే చెందిన ప్రతిభా భారతకే స్పీకర్ గా అవకాశం కల్పించారు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడు కి ఆ అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. చీఫ్ విప్ గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించనున్నట్లు చెబుతున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్