తల్లికి వందనంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు.. ఆఖరికి జగన్‌ అదే పంథాలో

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి పార్టీలు సూపర్‌ సిక్స్‌ పేరుతో కీలక హామీలను ఇచ్చింది. వీటిలో తల్లికి వందనం పేరుతో పాఠశాలలకు చిన్నారులను పంపించే తల్లులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున అందిస్తామని వెల్లడించారు.

minister Nimmala Ramanaidu

నిమ్మల రామానాయుడు ప్రచారం చేస్తున్న చిత్రం

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి పార్టీలు సూపర్‌ సిక్స్‌ పేరుతో కీలక హామీలను ఇచ్చింది. వీటిలో తల్లికి వందనం పేరుతో పాఠశాలలకు చిన్నారులను పంపించే తల్లులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున అందిస్తామని వెల్లడించారు. ఇదే విషయాన్ని కూటమి పార్టీలు నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేశారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని కూటమి ఏర్పాటు చేసింది. అయితే, తల్లికి వందనం పథకం అమలుపై ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని స్వయంగా నారా లోకేశ్‌ శాసనసభలో వెల్లడించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి రామానాయుడు ఇంటింటికీ వెళ్లి ఈ పథకం గురించి ప్రచారం చేశారు. 

దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం వైసీపీ పెద్ద ఎత్తున షేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ’నీకో పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అదిగదిగో ఆ పాపకు పదిహేను వేలు’ అంటూ అప్పట్లో రామానాయుడు చేసిన ప్రచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రామానాయుడు వ్యాఖ్యలను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై మీడియాతో మాట్లాడిన జగన్‌ కూడా.. రామానాయుడు చేసిన వ్యాఖ్యలను ఒక లెవెల్‌లో ట్రోల్‌ చేసేలా సెటైర్లు వేశారు. మరో వైపు వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే పనిలో టీడీపీ సోషల్‌ మీడియా నిమగ్నమైంది. జగన్‌ కూడా గతంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పథకాలను అమలు చేయలేదని, తమకూ సమయం పడుతుందని చెబుతూనే.. జగన్‌ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలు జగన్‌ పాలనను అసహ్యించుకునే ృ11 స్థానాలను కట్టబబెట్టారని, అయినా వైసీపీకి సిగ్గు రావడం లేదంటూ విమర్శిస్తోంది టీడీపీ సోషల్‌ మీడియా. తమ గురించి తరువాత విమర్శలు చేద్దురుగానీ పథకాలు అమలు చేయాలంటూ వైసీపీ సోషల్‌ మీడియా సూచిస్తోంది. ఏది ఏమైనా తల్లికి వందనం పథకం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు కేంద్ర బిందువుగా మారింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్