Uk Election Result : ఓటమిపై రిషి సునాక్ రియాక్షన్ ఇదే..

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ 400 స్థానాలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది.

 Rishi Sunak speaking after the defeat

ఓటమి అనంతరం మాట్లాడుతున్న రిషి సునాక్

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ 400 స్థానాలను కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖరారు కావడంతో భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించారు. ఈ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అంటూ స్పష్టం చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించిందని, ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్మార్టర్ కు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతోందని, అది తమ దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందన్నారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్లోని పార్టీ మద్దతుదారులను ఉద్దేశించే ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తనను క్షమించాలంటూ సునాక్ కోరారు. పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. సునాక్ పార్టీ పరాజయం పాలైనప్పటికీ ఎంపీగా మాత్రం ఆయన మరోసారి విజయం సాధించారు. 

ఇదిలా ఉంటే గడిచిన 14 ఏళ్లుగా బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్  ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ కొంతమేర తగ్గుతూ వచ్చింది. కొన్ని కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ తాజాగా ఓటమిపాలైంది. లేబర్ పార్టీ నుంచి కీర్ స్మార్టర్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి నిలిచి విజయాన్ని దక్కించుకున్నారు. ఆయనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశ పునరుద్ధరణ దిశగా తాము పని చేస్తామని స్పష్టం చేశారు. కొత్త అధ్యాయన్ని ప్రారంభిద్దామని విజయం అనంతరం ఆయన ప్రకటించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్