సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన తెలియజేశారు. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, సబితా ఇంద్రారెడ్డి ఎందుకు అలిగారు, ఎమ్మెల్యేలు పోడియాన్ని ఎందుకు చుట్టూ ముట్టారో మీరు చదివేయండి. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. తన ప్రసంగం ముగింపు సమయంలో కళాజీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు సభకే రావడం లేదని, ఇంకా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎక్కడ వస్తారని ఎద్దేవా చేశారు.
సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన తెలియజేశారు. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, సబితా ఇంద్రారెడ్డి ఎందుకు అలిగారు, ఎమ్మెల్యేలు పోడియాన్ని ఎందుకు చుట్టూ ముట్టారో మీరు చదివేయండి. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. తన ప్రసంగం ముగింపు సమయంలో కళాజీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు సభకే రావడం లేదని, ఇంకా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎక్కడ వస్తారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో సబితా ఇంద్రారెడ్డి ఏదో కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 'వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ముంచి అక్కడకు తేలారని, ఆ అక్కల మాటలు విన్నారనుకో జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కేటీఆర్.. కెసిఆర్ మొదటి విడత బీఆర్ఎస్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పదేపదే ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నప్పటికీ బిఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. ఇంతలో మంత్రి శ్రీధర్ బాబు కలుగజేసుకొని ఎవరి పేర్లు చెప్పకుండానే కామెంట్స్ చేశారని, వెనుకాల ఉన్నవాళ్లు అంటే బయట ఉండే వాళ్ళు కూడా కావచ్చు అని అన్నారు. అనవసరంగా మహిళా సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. అక్క అక్క అంటూనే తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంతో ప్రేమతో తాను అప్పుడు కాంగ్రెస్ లోకి రేవంత్ ను ఆహ్వానించానని అన్నారు. ఖచ్చితంగా మంచి ఉన్నత పదవులకు వెళ్తావని ఆశీర్వదించాలని స్పష్టం చేశారు. అలాంటి తనపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఏం ముంచామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఆశాకరణం అవుతావని ఆరోజు తాను చెప్పానో లేదో గుండెలపై చేయి వేసుకొని చెప్పాలన్నారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి తమ వ్యక్తిగత సంభాషణలను బయటపెట్టారని, దానికి కొనసాగింపుగా తాను కూడా కొన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు. పార్టీకి, తనకు భవిష్యత్తు ఉంటుందని ఆమె చెప్పారని, దాని తర్వాత జరిగిన ఘటనలు కూడా వివరించాల్సి ఉందన్నారు. తాను కొడంగల్ లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయమని కాంగ్రెస్ అధినాయకం చెప్పిందని, దీంతో సబితా ఇంద్రారెడ్డి తనతో మాట్లాడుతూ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. ఆ తర్వాత అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ లో చేరిపోయారన్నారు. తమ్ముడుగా తనను పిలిచి ఎంపీగా పోటీ చేయమని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి.. కెసిఆర్ మాయమాటలకు పడిపోయి కాంగ్రెస్ కు ద్రోహం చేసి మంత్రి పదవి కోసం వెళ్లిపోయారని విమర్శించారు. అది గుర్తు పెట్టుకుని వారి మాటలను నమ్మవద్దని కేటీఆర్ కు చెప్పానన్నారు. ఇది నిజమా కాదా అన్నది సబితా ఇంద్రారెడ్డి చెప్పాలని సవాల్ చేశారు.