రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో నిధులు విడుదల చేసేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న మోసపూరితమైన చర్యలను ఆయన ఎండగట్టారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్ళించారని కేటీఆర్ ఆరోపించారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో నిధులు విడుదల చేసేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే రైతు రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న మోసపూరితమైన చర్యలను ఆయన ఎండగట్టారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్ళించారని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు. 40 లక్షల మందికిపైగా రైతులు లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత కల్పించినట్లు దుయ్యబట్టారు. రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
2014లోనే కెసిఆర్ ప్రభుత్వం లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చిందన్నారు. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లుగా అంచనా వేశామని, లబ్ధిదారుల సంఖ్య 37 లక్షలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అందరికీ రైతు బంధు విడుదల చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని పథకాలు మాదిరిగానే రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధపడుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రుణమాఫీ ప్రకటనపై బీఆర్ఎస్ లోని కీలక నాయకులు స్పందిస్తున్నారు. రైతులను మోసం చేసే చర్యలకు మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. రైతులకు మేలు చేసే చర్యలను స్వాగతించకుండా విమర్శలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. మంచి చేసినప్పుడు కనీసం అభినందించకపోయినా విమర్శించకుండా ఉండాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.