టాలీవుడ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్‌ రెడ్డి.. కారణం అదేనా..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గద్దర్‌ పేరుతో అవార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, అయితే, దీనిపై కనీసం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మహాకవి జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత స్వర్గీయ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రముఖ తమిళ రచయిత్రి శివ శంకరికి విశ్వంభర డాక్టర్‌ సి నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేశారు.

Chiranjeevi with CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గద్దర్‌ పేరుతో అవార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, అయితే, దీనిపై కనీసం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మహాకవి జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత స్వర్గీయ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రముఖ తమిళ రచయిత్రి శివ శంకరికి విశ్వంభర డాక్టర్‌ సి నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేశారు. అలాగే, సినారే రచించిన సమన్వితం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్‌ అవార్డులతో భర్తీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలను, సూచనలను అందించాలని రేవంత్‌రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు. కానీ, సినీ పరిశ్రమ మౌనంగా ఉందని, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, సాధించిన విజయాలకు గౌరవంగా గద్దర్‌ అవార్డులను ప్రకటించాలనుకున్నామన్నారు. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం బాధకరమని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారాన్ని రేపాయి. వెంటనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి అదే వేదికపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చొర తీసుకుని సినిమా అవార్డులను పునరిద్ధిరిస్తూ, సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్‌ పేరు మీదుగా గద్దర్‌ అవార్డులను అందిస్తామన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరఫున, ఫిలిం చాంబర్‌, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు స్పష్టం చేవారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్