రియాసి ఉగ్రవాది స్కెచ్‌ విడుదల.. రూ.20 లక్షలు రివార్డు ప్రకటన

జమ్మూ కాశ్మీర్‌లో బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు బుధవారం విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును అందిస్తామని ప్రకటించారు. రియాసిలో ఆదివారం భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి కాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

terrorist Sketch

దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌


జమ్మూ కాశ్మీర్‌లో బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు బుధవారం విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును అందిస్తామని ప్రకటించారు. రియాసిలో ఆదివారం భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి కాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు కోసం తీవ్రంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు ఇప్పటికే భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో 11 భద్రతా దళాల బృందాలు పని చేస్తున్నాయి. పోనీ తెరయాత్‌ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి దిగ్భందించారు. జమ్మూ, రాజౌరి జిల్లాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్‌ ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేశాయి. దాదాపు 20 మందికిపైగా వ్యక్తులకు పోలీసులు విచారణకు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీసులు, ఆర్మీ సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) బృందాలను మోహరించినట్టు ఉదంపూర్‌ - రియాసి రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఐజీ) రయీస్‌ మహ్మద్‌ భట్‌ తెలిపారు. రియాసీ ఘటనకు కారణమైన ఉగ్రవాది స్కెచ్‌ను బుధవారం జమ్మూకాశ్మీర్‌ పోలీసులు విడుదల చేశారు. అతని గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డును ప్రకటించారు. ఈ దాడి వెనుక లస్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం నుంచి ఎన్‌ఐఏ ఫోరెన్సిక్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్