సీఎం రేవంత్ రెడ్డి సూచనపై స్పందించిన నటుడు మోహన్ బాబు.. ఉడతా భక్తిగా చేస్తానని వెల్లడి

సినిమాలోని నటీనటులతో డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగానికి సూచించారు. సీఎం రేవంత్ సూచనలపై ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు పెట్టారు.

Actor Manchu Mohan Babu

నటుడు మంచు మోహన్ బాబు 



సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా రంగానికి చెందిన ప్రముఖులు.. కొంతైనా సమాజానికి ఇచ్చేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే. సినిమా విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరే వాళ్ళు.. ఆ సినిమాలోని నటీనటులతో డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సినిమా రంగానికి సూచించారు. సీఎం రేవంత్ సూచనలపై  ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు పెట్టారు. 'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ సినిమా నటీ, నటులను ఒకటి లేదా రెండు నిమిషాలు నిడివితో వీడియో చేసి ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశా. అయినా సీఎం ఆదేశం మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నా' అని మోహన్ బాబు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కు సిఎం రేవంత్, సీఎంఓ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ వాహనాలను సీఎం మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన మోహన్ బాబు ఈ మేరకు తాను వీడియోలు చేస్తానని పేర్కొన్నారు. ఇంకా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎవరెవరు స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సామాజిక బాధ్యతగా సినీ రంగ ప్రముఖులు వీడియోలు విడుదల చేస్తే ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. 

తెలంగాణలో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండడంతోపాటు డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సినీ రంగానికి చెందిన ప్రముఖుల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీలు చెప్పే విషయాలను సాధారణ ప్రజలు వేగంగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ మేరకు సినీ రంగాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిపై సినీ రంగం నుంచి సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు స్పందించగా మిగిలిన సినీ ప్రముఖులు నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్