వైసిపి చేజారునున్న రాజ్యసభ ఎంపీలు.. పార్టీకి రాజీనామా చేయనున్న మోపిదేవి వెంకటరమణ

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితమైంది. దీంతో వైసీపీలోని కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న శాసనమండలి, రాజ్యసభలోనూ ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

MP Mopidevi Venkataramana

రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితమైంది. దీంతో వైసీపీలోని కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న శాసనమండలి, రాజ్యసభలోనూ ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు టిడిపి, అటు బిజెపి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగానే వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా భావించే మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరెందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. మోపిదేవి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం ఆయన పార్టీ సభ్యత్వంతోపాటు రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు చెబుతున్నారు. రాజీనామా అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈయన దారిలోనే మరో రాజ్యసభ ఎంపీ మస్తాన్ రావు కూడా పయనించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో కూడా టిడిపి ముఖ్య నేతలు సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. మిగిలిన రాజ్యసభ సభ్యులు కూడా ఊగిసలాటలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో బలం ఉండడం వల్లే బిజెపి జగన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, సిఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఆ బలాన్ని తగ్గించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని దెబ్బ కొట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలపై గాలం వేసినట్లు తెలుస్తోంది. మరో నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా టిడిపి ముఖ్య నాయకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన వైసీపీ ముఖ్య నాయకులు సదరు రాజ్యసభ ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న టిడిపి, శాసన మండలిలోను బలంగా ఉన్న వైసీపీని బలహీనపరిచేందుకు ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసిపికి రాజీనామా చేయడంతోపాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. ఈమె టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమెతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

నివారణకు జగన్ ఏం చేస్తారన్న ఆసక్తి..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీని ఇప్పటికే వీడగా, తాజాగా రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతుండడం ఆయనను కలవడానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యలకు ఆయన సిద్ధమవుతున్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న నాయకులతో సంప్రదింపులు జరపాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులను పురమాయించినట్లు తెలుస్తోంది. వారంతా ఎంపిలతో సంప్రదింపులు జరిపి పార్టీలోనే ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నించనున్నారు. వైసిపిలోనే ఉంటే ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతోనే చాలామంది పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం సంప్రదింపులకు మనసు మార్చుకొని పార్టీలో ఉండేందుకు ఎంతమంది ఆసక్తి చూపిస్తారన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్