ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా జంప్.. రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తొలకంటి ప్రకాశ్ గౌడ్ రేపు (శుక్రవారం) సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

prakash goud

రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

హైదరాబాద్, ఈవార్తలు : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోగా, మరో ఎమ్మెల్యే కూడా పార్టీ జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తొలకంటి ప్రకాశ్ గౌడ్ రేపు (శుక్రవారం) సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగినా, ఇన్ని రోజులు హోల్డ్‌ పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయన హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సారి కాంగ్రెస్‌లోకి చేరిక కన్ఫార్మ్ అయ్యింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ గౌడ్ నాలుగు సార్లు గెలుపొందారు.

ఇదిలా ఉండగా, అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 31కి పడిపోనుంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అవ్వగా, ప్రకాశ్ గౌడ్‌తో కలిపి 8 మంది కాంగ్రెస్ గూటికి వెళ్లినట్లు అవుతుంది. ఇటీవల ప్రకాశ్ గౌడ్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలోకి వెళ్తారా? అని ప్రచారం జరిగినా, కాంగ్రెస్‌కే ప్రకాశ్ గౌడ్ జై కొట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్