రాజస్థాన్‌లోని సాలంబర్ ఎమ్మెల్యే అమృతలాల్ మీనా గుండెపోటుతో మరణించారు. ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మీనా గత రాత్రి ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉదయపూర్‌లోని MB ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
bjp
రాజస్థాన్‌లోని సాలంబర్ ఎమ్మెల్యే అమృతలాల్ మీనా గుండెపోటుతో మరణించారు. ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయస్సు 65 ఏళ్లు. మీనా గత రాత్రి ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉదయపూర్‌లోని MB ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మీనా 2013 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా అమృతలాల్ మీనా మరణం తర్వాత, రాజస్థాన్ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య 114 కి తగ్గింది.
1959 సెప్టెంబరు 15న జన్మించిన అమృతలాల్ మీనా వరుసగా మూడోసారి సాలుంబర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమృతలాల్ మీనా బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీనా బీజేపీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. మీనా మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉదయపూర్‌లోని ఎంబి ఆసుపత్రి వద్ద బిజెపి అధికారులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు.
జైపూర్ నుండి సాలంబర్‌కు వెళుతుండగా, ఎమ్మెల్యే అమృత్ మీనా ఆరోగ్యం క్షీణించింది. ఛాతీలో నొప్పి రావడంతో అర్థరాత్రి ఆసుపత్రిలో చేరారు. తెల్లవారు జామున గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు.