దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్ముడే తనను పంపించాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని దియోరియాలో ఎన్నికల ప్రచారంలో మంగళవారం పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్ధేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ
దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్ముడే తనను పంపించాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని దియోరియాలో ఎన్నికల ప్రచారంలో మంగళవారం పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్ధేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ జీవ సంబంధమైన వ్యక్తులు అని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కాదన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే సాయం చేయాలని ప్రధాని మోదీని పరమాత్మ పంపించారని ఎద్దేవా చేశారు. దేశంలోని రైతులు, కార్మికులకు సేవలు చేసేందుకు పరమాత్మ ప్రధాని మోదీని పంపించాలేదన్నారు. నిజంగా పరమాత్మ మోదీని పంపించి ఉంటే.. ఆయన పేదలు, రైతులకు సాయపడేవారన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు, సంపన్నులు సేవలు మోదీ తరిస్తున్నారని, దీన్ని బట్టి పరమాత్మ ఆయన్ను పంపించలేదన్న విషయం అర్థమవుతోందన్నారు. పేదల సమస్యలు, ధరల మంట, నిరుద్యోగం వంటి వాస్తవిక అంశాలను కాషాయ నేతలు విస్మరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి కాకుండా మతం ప్రాతిపదికన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ నేతలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వ విధానాలకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో సంపన్నులకే మేలు జరిగిందని, సాధారణ ప్రజలకు అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు.