Rahul gandhi | సంచలనం.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ఊడిన ఎంపీ పదవి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రాహుల్ గాంధీపై అనర్హత వేటు||

ఈవార్తలు, నేషనల్ న్యూస్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేసింది. మోదీ పరువునష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్ సభ నుంచి ఎంపీగా ఆయనను తొలగిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం.. ఒక ప్రజాప్రతినిధి ఏదేని కేసులో దోషిగా తేలి, రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు జైలు శిక్ష పడితే ఆయన ఆ పదవికి అనర్హుడు అవుతాడు. తాజాగా, రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్