తెలంగాణలో రైతుకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లిన వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. పోలీసుల వైఖరి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతును బేడీలు వేసుకుని తీసుకెళ్లిన వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రైతును బేడీలతో తీసుకెళుతున్న పోలీసులు
తెలంగాణలో రైతుకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లిన వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. పోలీసుల వైఖరి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతును బేడీలు వేసుకుని తీసుకెళ్లిన వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనా అంటూ ఎద్దేవా చేశారు. వారి కుటుంబ సభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట అంటూ ఆరోపించారు. నెల రోజులుగా చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఒకేనట, గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ఒకేనట అంటూ విమర్శలు గుప్పించారు. చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న రేవంత్ రెడ్డి.. నీ నిజ రూపం రాష్ట్రంలోని పేదలందరికి తెలిసిపోయిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా క్షమాపణ చెప్పి కేసులు రద్దు చెయ్యాలని, రైతులను విడుదల చెయ్యాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేయడం ఏంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరిన సీఎం..
లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీర్యా నాయక్ చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై అధికారులను ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఎలాంటి చర్యలు సహించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో ప్రస్తుతం సర్వత్ర ఈ వ్యవహారంపై ఆసక్తి రేకెత్తుతోంది.