ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు మహరాష్ట్రలోని పాల్ఘర్‌లో శుక్రవారం పర్యటించిన ప్రధాని.. ఈ సందర్భంగా క్షమాపణలను కోరారు. మహరాష్ట్రలో చత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్షమాపణలు తెలియజేశారు. తాను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు మహరాష్ట్రలోని పాల్ఘర్‌లో శుక్రవారం పర్యటించిన ప్రధాని.. ఈ సందర్భంగా క్షమాపణలను కోరారు. మహరాష్ట్రలో చత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్షమాపణలు తెలియజేశారు. తాను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి తన క్షమాపణలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారంతా ఈ ఘటనతో తీవ్ర వేధనకు గురై ఉంటారన్న ప్రధాని మోదీ.. వారికి తల వంచి క్షమాపణలు చెబుతున్నానన్నారు. ’మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు’ అంటూ మోదీ పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మోదీ తొలిసారి బహిరంగ క్షమాపణలు కోరడం సంచలనంగా మారింది.
కొద్దిరోజులు కిందట మహరాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం తాజాగా కుప్పకూలిపోయింది. 35 అడుగులు ఎత్తున ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు నాలుగో తేదీన నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఏడాది కూడా పూర్తికాకముందే విగ్రహం కుప్పకూలిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ మహరాష్ట్రలో పర్యటిస్తున్న నేపథ్యంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ క్షమాపణలు కోరారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలిపోయినట్టు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. విగ్రహం కుప్పకూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న దృషి నాణ్యతపై లేకుండా పోయిందటూ ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.