ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. పనిచేసిన తర్వాత సిస్టమ్స్ లాగౌట్ చేయడంపై ఉద్యోగులకు ప్రధాని మోడీ ఒక విజ్ఞప్తిని చేశారు. డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్న మనం నిత్యం హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడులు గురించి వింటున్నామని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని ప్రధాని మోడీ ఉద్యోగులకు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. పనిచేసిన తర్వాత సిస్టమ్స్ లాగౌట్ చేయడంపై ఉద్యోగులకు ప్రధాని మోడీ ఒక విజ్ఞప్తిని చేశారు. డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్న మనం నిత్యం హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడులు గురించి వింటున్నామని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని ప్రధాని మోడీ ఉద్యోగులకు సూచించారు. ప్రతిరోజు పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేస్తున్నారా..? లేదా..? అని ఉద్యోగులను ప్రశ్నించిన ప్రధాని మోడీ.. తాను మాత్రం ఆ పని తప్పక చేస్తుంటానని స్పష్టం చేశారు. సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా..? లేదా..? అని చూసుకునే పనిని ప్రతి ఆఫీసులో ఒక వ్యక్తికి అప్పగించాలన్నారు. ఆఫీసు నుండి ఇంటికి వెళ్లేటప్పుడు తన సిస్టమ్ ను తానే లాగవుట్ చేసుకుంటానని ప్రధాన మోడీ వివరించారు. కంప్యూటర్లు ఓపెన్ చేసి ఉంచడం వల్ల సైబర్ దాడులు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
గత కొన్నాళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన ఈ కీలక సూచన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు తాను ఎంతగానో ఇష్టపడతాను అన్న మోడీ.. కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయని, వాటిని పరిష్కరించుకుని పోవడంతోపాటు ఆ ఇబ్బందులు బారిన పడకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉద్యోగులు తాము పనిచేసే కార్యాలయాల్లో తప్పకుండా సిస్టమ్ ను లాగ్ అవుట్ చేయడం ద్వారా ఈ తరహా ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించవచ్చని, డీప్ ఫేక్ తో తన గొంతు కూడా అనుకరించారని గతంలోనే ప్రధాని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని ఉద్యోగులకు చేసిన కీలక సూచనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.