లోక్ సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7:15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నరేంద్ర మోదీ
లోక్ సభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7:15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెస్, ఇతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే కావడం విశేషం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లోను కాంగ్రెస్ ను ఆయన విజయ పథాన నడిపించి ప్రధానిగా నియమితులయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ఇందిరా గాంధీ నాలుగు పర్యాయాలు ప్రధానిగా చేసినా వరుసు ఎన్నికల్లో గెలవలేదు. బిజెపి వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం.. మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండడంతో నెహ్రు సరసన నిలవనన్నారు. అయితే 1952లో సార్వత్రికలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు మాత్రం ఇందిరా గాంధీ పేరిటే ఉంది. ఆమె 15 ఏళ్ల 350 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు.
ఇవి మోదీ వివరాలు
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని వాద్ నగర్ లో మధ్య తరగతి కుటుంబంలో 1950లో జన్మించారు. హీరాబన్ దామోదర్ దాస్, మోదీ దంపతులకు ఆయన మూడో సంతానం. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. అతి కొద్ది కాలంలోనే బిజెపి అగ్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మోదీని ఎల్కే అద్వానీ ప్రోత్సహించారు. 1990లో అద్వానీ రథయాత్రలో మోడీ పాల్గొన్నారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి - కాశ్మీర్ ఏక్తా యాత్రకు నరేంద్ర మోదీ జాతీయ ఇన్చార్జిగా పనిచేశారు. 2001లో గుజరాత్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచి సైతం వచ్చాయి. అయినప్పటికీ 2014 మే లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు గుజరాత్ సిఎంగా పని చేశారు. తాజాగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.