మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి గ్రీన్‌ సిగ్నల్‌

దేశంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్‌డీఏ పక్ష నేతగా ప్రధాని మోదీని ఎనుకున్నారు. దీంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం అయినట్టు అయింది.

pm Modi, president Draupadi Murmu

ప్రధాన మోదీ, ద్రౌపది ముర్ము


దేశంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్‌డీఏ పక్ష నేతగా ప్రధాని మోదీని ఎనుకున్నారు. దీంతో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమం అయినట్టు అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం సాయంత్రం కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ఇటీవల ఎన్‌డీఏలో గెలిచిన ఎంపీలతో కలిసి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను లోక్‌సభ పక్షనేతగా ఎన్‌డీఏ పక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఎన్‌డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అనంతరం మోదీని కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. దీంతో ప్రఽధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతోపాటు పలువురు కేబినెట్‌ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 290కుపైగా సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధానిగా నరేంద్ర మోదీగా వరుసగా మూడో పర్యాయం బాధ్యతలు చేపట్టబోతున్నారు. 




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్