తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ పాయింట్లు సాధించే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ పాయింట్లు సాధించే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. పదో తరగతిలో టాప్‌లో నిలిచిన విద్యార్థులకు పురస్కారాలను అందించిన కార్యక్రమంలో ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి.. పదో తరగతిలో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ఇంటర్ కాలేజీల్లో ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్కూళ్లలో సెమీ రెసిడెన్సియల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను, స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పనకు పెద్ద పీట వేయనున్నట్టు ప్రకటించారు. పదో తరగతిలో అత్యుత్తమ పలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు.