విలక్షణ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని, రాజకీయాలకు పూర్తిగా దూరం జరుగుతున్నట్లు వెల్లడించారు.
వైఎస్ జగన్‌తో పోసాని కృష్ణమురళి
హైదరాబాద్, ఈవార్తలు : విలక్షణ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని, రాజకీయాలకు పూర్తిగా దూరం జరుగుతున్నట్లు వెల్లడించారు. తన పూర్తి జీవితాన్ని కేవలం కుటుంబానికే కేటాయిస్తానని, జీవితంలో ఎన్నడూ రాజకీయాలపై మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన పోసాని.. కూటమి గెలుపు తర్వాత రాజకీయాల్లో చురుగ్గా ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల కంటే ప్రశాంతమైన జీవితం గడపడానికే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీలో పోసాని కీలకంగా పనిచేశారు. అయితే, ప్రస్తుతం ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల కొండపై దోచుకోవడానికే వచ్చారని పోసాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.