గజ్వేల్ గడ్డపై రాజకీయ సమరం.. పోటాపోటీ సభలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సన్నద్ధం.!

తెలంగాణలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వేసవికి ముందే రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోబోతోంది. ఈ నెలలో కెసిఆర్ భారీ బహిరంగ సభను గజ్వేల్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తనను కలిసిన పార్టీ నాయకులకు సమాచారాన్ని ఇచ్చారు. తేదీ ఖరారు చేయలేదు గాని ఈ నెలలోనే సమావేశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.

KCR, CM Revant Reddy

కెసిఆర్, సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వేసవికి ముందే రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోబోతోంది. ఈ నెలలో కెసిఆర్ భారీ బహిరంగ సభను గజ్వేల్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తనను కలిసిన పార్టీ నాయకులకు సమాచారాన్ని ఇచ్చారు. తేదీ ఖరారు చేయలేదు గాని ఈ నెలలోనే సమావేశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కెసిఆర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత పాల్గొనబోయే అతిపెద్ద బహిరంగ సభగా దీనిని నిర్వహించేందుకు భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కెసిఆర్ సభను గజ్వేల్ లో నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ కూడా గజ్వేల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కుల గణనను విజయవంతం చేసినందుకు ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో గజ్వేల్ వేదికగా రెండు పార్టీలు రాజకీయంగా యుద్ధానికి దిగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో రాజకీయ పోరాటం ఒక రేంజ్కు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తాను గొప్పగా పరిపాలిస్తున్నానని చరిత్రలో మిగిలిపోయే నిర్ణయాలను ఎస్సీ వర్గీకరణ, కుల గణన ద్వారా తీసుకున్నామని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గజ్వేల్, సూర్యాపేటలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ సభలకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్గే హాజరవుతారని చెబుతున్నారు. గజ్వేల్ లో ఎస్సీ వర్గీకరణ సభ, సూర్యాపేటలో బీసీ కులగనన బహిరంగ సభలో నిర్వహించేలా ఏర్పాటులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ లో సభ పెట్టాలనే ప్రతిపాదన మాత్రం ఆసక్తికరంగా మారింది. 

గజ్వేల్ సభపై భారతీయ రాష్ట్ర సమితి దృష్టి 

మరోవైపు ఇటీవల తనను కలిసిన జనగామ కు చెందిన భారతీయ రాష్ట్ర సమితి నేతలకు కేసీఆర్ స్వయంగా గజ్వేల్ లో నిర్వహించనున్న సభ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల ఆఖరిలో బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని వెల్లడించినట్లు అక్కడ కెసిఆర్ ను కలిసిన నేతలు కొందరు బయటకు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో పార్టీని యాక్టివేట్ చేసే ఉద్దేశంతో కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్నారు. అయితే కెసిఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తే ఆ ఊపు వేరుగా ఉంటుంది అన్నది పార్టీ కార్యకర్తల భావన. ఈ నేపథ్యంలోనే ఆయన రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ లో సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు భారతీయ రాష్ట్ర సమితి ప్రణాళిక రచిస్తోంది. గజ్వేల్ కూడా కెసిఆర్ - హరీష్ రావు నియోజకవర్గం పక్క పక్కనే ఉండడంతో జనాన్ని భారీగా సమీకరించవచ్చు అన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఈ సభ విజయవంతం చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని డిఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ వేదికగా భారీ బహిరంగ సభల ద్వారా పోటీపడేందుకు సన్నద్ధమవుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరు నేతలు పోటీ చేసి తలపడ్డారు. అయితే ఇక్కడ బిజెపికి చెందిన మరో నేత విజయం సాధించిన విషయం తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్