మోదీకి వింత పేరు పెట్టిన చైనీయులు.. భారత ప్రధాని అంటే ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| ప్రధాని నరేంద్ర మోదీ||


భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. కానీ భారత్, చైనాల మధ్య శత్రుత్వం ఉన్నా.. భారత ప్రధానిపై ప్రశంసలు వస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉందంటూ.. భారత ప్రధాని మోదీకి చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు అనే విషయాన్ని అమెరికాకు చెందిన వ్యూహాత్మక సంబంధాల మ్యాగజైన్‌ 'ది డిప్లొమాట్‌' లో జర్నలిస్ట్ చున్‌షాన్‌ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 సంవత్సరాల మీడియా వ్యూహాలలో చైనా నెటిజన్లు ఓ విదేశీ నేతలుకు ఇలా నిక్ నేమ్ పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు అంటూ.. చున్‌షాన్‌ వివరించారు. చైనా ఇంటర్నెట్లో మోదీకి అరుదుగా అసాధారణమైన మారుపేరు ఉంది. అదేంటంటే 'మోదీ లావోగ్జియన్‌' అంటే దీని అర్థం మోదీ చిరంజీవి అని.. ఆసాధారణ సామర్థ్యాలను చేసే వృద్ధ వ్యక్తిని ఇలా పిలుస్తారు. మోదీ పై చైనాకు ఇంత గౌరవ ఉందని చూపడం అరుదని మ్యాగజైన్లో పేర్కొన్నారు. మోదీ అందరి నాయకుల కంటే చాలా డిఫరెంట్ గా డ్రెస్సింగ్, ఆయన ఆహార అలవాట్లో కూడా విభిన్నంగా ఉంటూ భారత్ ను మంచి గా ముందుకు తీసుకెళుతున్నారు అని చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు మోదీకి ప్రశంసలు కురిపించారని ఈ వెబ్ సైట్ కు 58 కోట్లకు పైగా యాక్టివ్‌ యూజర్లున్నారని అమెరికా మ్యాగజైన్‌ ది డిప్లొమేట్‌ తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్