మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌.. ఎస్పీ కార్యాలయానికి తరలింపు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్‌ తగిలింది. తాజాగా ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయ డంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈవీఎం ద్వంసం కేసుతోపాటు మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ కేసులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

pinnelli ramakrishna reddy

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్‌ తగిలింది. తాజాగా ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయ డంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన ఈవీఎం ద్వంసం కేసుతోపాటు మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ కేసులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన కొద్ది నిమిషాల్లోనే ఆయనను పోలీసులు నరసారావుపేటలో అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే పిన్నెల్లి తన పాస్ట్‌పోర్టును కోర్టులో సమర్పించారు. గడిచిన కొద్దిరోజులు నుంచి కోర్టు ఆదేశాలతో ఆయన పల్నాడు ఎస్పీ ఆఫీసులో నేరుగా వెళ్లి సంతకం చేసి వస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో మాచర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. పోలింగ్‌ రోజు ఈవీఎంలను ద్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాల్వాయి గేటు అనే గ్రామంలో పోలింగ్‌ బూత్‌లో నేరుగా వెళ్లి ఈవీఎంను పగులగొట్రాఉ. దీనిపై అప్పట్లోనే కేసు నమోదైంది. 

ఈ కేసుతోపాటు మరికొన్ని కేసుల్లో ఆయనను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు కూడా వెళ్లాయి. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. బుధవారం బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయడంతో అరెస్ట్‌ చేశారు. అయితే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలిసింది. ప్రత్యేక బృందాలను నియమించి ఆయన్ను పట్టుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు చెబుతున్నారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాజా ఎన్నికల్లో ఓటమి చూడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ వైసీపీ శ్రేణులను షాక్‌కు గురి చేసింది. హైకోర్టులో బెయిల్‌ ముందస్తు లభిస్తుందని భావించిన ఆయనకు నిరాశే ఎదురైంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్