రాష్ట్రంలో నూతనంగా అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించి తొలి సంతకాన్ని చేయగా, మరో నాలుగు కీలక ఫైళ్ళపైనా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో నూతనంగా అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించి తొలి సంతకాన్ని చేయగా, మరో నాలుగు కీలక ఫైళ్ళపైనా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. తాజాగా శనివారం మరో కీలక నిర్ణయం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రిగా తన ఫోటోతోపాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఐ అండ్ పిఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయంతో జనసేన శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తొలి నుంచి చెబుతున్నట్టుగానే పవన్ కళ్యాణ్ కు అధిక గౌరవాన్ని కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా పదవులు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అందుకు అనుగుణంగానే ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అలాగే మరికొన్ని కీలక మంత్రిత్వ శాఖలను అప్పగించారు. తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫోటో ఏర్పాటు చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలతో జనసేన శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రితో సమానంగానే ఉప ముఖ్యమంత్రికి గౌరవాన్ని కల్పిస్తున్నట్టుగా చెబుతున్నారు.