ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌.. త్వరలో కేసు వేసి విచారణ చేస్తాం : నారా లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, దీనిపై విచారణ కూడా చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేసు వేసి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

nara lokesh

నారా లోకేష్‌ 



తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, దీనిపై విచారణ కూడా చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేసు వేసి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. పెగాసిస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఏపీలోని ప్రముఖుల ఫోన్లును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ట్యాపింగి చేసిందని లోకేష్‌ ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తమ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, వీటిని త్వరలోనే బయటపెడతామన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయడంతోపాటు విచారణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్‌ సర్కార్‌ విచారణ ప్రారంభించడంతోపాటు కీలకమైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారమంతా అప్పటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే జరిగిందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ చేసిన తాజా వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్