ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌

రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమితులైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖల బాధ్యతలను కూడా ఆయన అదే రోజు తీసుకోనున్నారు.

pawan kalyan

పవన్‌ కల్యాణ్‌


రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమితులైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖల బాధ్యతలను కూడా ఆయన అదే రోజు తీసుకోనున్నారు. జనసేన ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా 175 స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించగా, పవన్‌ కల్యాణ్‌తోపాటు మరో ముగ్గురు జనసేన నేతలకు మంత్రి పదవులు దక్కాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్